HomeAndhra Pradeshరాజువమ్మంగి మండలంలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్లు బొజ్జిరెడ్డి సుడిగాలి పర్యటన

రాజువమ్మంగి మండలంలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్లు బొజ్జిరెడ్డి సుడిగాలి పర్యటన

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్లు బొజ్జిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రుల్లోని రోగులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయో కమిషన్ చైర్మన్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య ఆరోగ్య సేవలపై బొజ్జిరెడ్డి నేరుగా ఆరా తీశారు. రాజవొమ్మంగి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వేపుగా పెరిగిన గడ్డిని చూసి వెంటనే తొలగించాలని అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశించారు. తదనంతరం అక్కడ నుంచి సింగంపల్లి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని కూడా తనిఖీ చేశారు. వసతి గృహంలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో వసతి గృహం సిబ్బందిపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్లు బొజ్జిరెడ్డి తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు నూతనంగా ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. వెంటనే వాటిని శుభ్రం చేసి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పోషక ఆహారాన్ని క్రమం తప్పకుండా మెనూ ప్రకారం ఉండేలా చూడాలని ఆయన వాపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular