HomeUncategorizedఅరుదైన వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారికి రూ.2 లక్షల ఆర్థిక సాయంజ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారికి రూ.2 లక్షల ఆర్థిక సాయంజ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా వైద్య పరీక్షలకు చెక్కు అందజేతమోసెస్ రాయల్ చికిత్సకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపు

కాకినాడ జిల్లా, జూలై 25: అరుదైన వ్యాధితో బాధపడుతున్న కాకినాడకు చెందిన నాలుగేళ్ల చిన్నారి మోసెస్ రాయల్ వైద్య పరీక్షల కోసం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందించారు.చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య పరీక్షలకే రూ.4 లక్షలు అవసరమని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, అవసరమైన మొత్తం నుంచి రూ.2 లక్షలను జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు అందజేయగా, ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణికి ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సూచనలు చేసి రూ.2 లక్షల చెక్కును చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు.వైద్యుల సూచన మేరకు మోసెస్ రాయల్‌కు మలేషియాలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అనంతర చికిత్సకు సుమారు రూ.1.5 కోట్లు అవసరమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ భారీ వ్యయం సామాన్య కుటుంబానికి భరించలేనిదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, “ఈ చిన్నారి భవిష్యత్తు మనందరి చేతుల్లో ఉంది. మలేషియాలో పరీక్షలు పూర్తైన తర్వాత అవసరమయ్యే చికిత్స కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలి” అని కూటమి నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు.మానవత్వంతో స్పందించి వైద్య పరీక్షలకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular