HomeUncategorized*కడప స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపికైన నక్కపల్లి హాకీ క్రీడాకారులు*

*కడప స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపికైన నక్కపల్లి హాకీ క్రీడాకారులు*

*కడప స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపికైన నక్కపల్లి హాకీ క్రీడాకారులు*

నక్కపల్లి-జిల్లావాణి ప్రతినిధి
డాక్టర్ వైస్సార్ కడప స్పోర్ట్స్ స్కూల్ కు బియస్ హాకీ క్లబ్ కు చెందిన ఇద్దరు హాకీ క్రీడాకారులు ఎంపిక అయ్యారని బియస్ హాకీ ఫౌండర్ సూరిబాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గత నెల జూన్ 19 న కడప స్పోర్ట్స్ స్కూల్ లో 7, 8, 9 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు పార్శ్వ ప్రవేశ ఎంపిక ట్రయల్స్ విభాగం లో జరిగిన హాకీ ఎంపికల్లో ఎస్. రాయవరం మండలం నారాయణ పట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుచున్న లంక హర్ష, స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాల లో 9వ తరగతి చదువుచున్న పల్లా ప్రసన్న కుమారి ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ ఎంపికైన క్రీడాకారులుకు ఈ నెల 27న వైస్సార్ స్పోర్ట్స్ స్కూల్ కడపలో ప్రవేశం ఉంటుందని అన్నారు.ఈ ఎంపికైన క్రీడాకారులును జిల్లా ప్రాధికార సంస్థ అధికారిణి పూజారి శైలజ,అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, ప్రధానోపాధ్యాయులు పీవి నరసింహ రావు, సీనియర్ క్రీడాకారుడు గాజుల రామచంద్ర రావు,బి ఎస్ హాకీ క్లబ్ అధ్యక్షులు చిన్న అప్పారావు,కార్యదర్శి కొల్నాటి తాతాజీ, కోచ్ గాజుల రాంబాబు,రంజిత్,ఇన్ఫినిటీ హాకీ అకాడమీ సభ్యులు,నానాజీ, రమేష్,శివ,గ్రామ పెద్దలు తదితరులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular