HomeAndhra Pradeshపీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్ ప్రజల అభిప్రాయాల కోసం ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్:జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్

పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్ ప్రజల అభిప్రాయాల కోసం ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్:జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటు లోకి తీసుకొచ్చినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్లో భాగంగా జూలై 27న కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. .పీజీఆర్ఎస్–మీకోసం ద్వారా సేవలు పొందిన ఫిర్యాదుదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నేరుగా ప్రభుత్వానికి తెలియ జేయవచ్చన్నారు. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

జిల్లా పీజీఆర్ఎస్ నోడల్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని తహసీల్దార్, ఎంపీడీవో లు, ఐటీడీఏ పీజీఆర్ఎస్ హాల్‌లో జిలా కలెక్టరేట్ లో అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే 1100 టోల్ ఫ్రీ నంబర్, meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. వాట్సాప్ గవర్నెన్స్:- 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 300కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీవెన్స్ కేంద్రాల్లో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రతి ఫిర్యాదుదారు తమ విలువైన ఫీడ్‌బ్యాక్‌ను నమోదు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular