HomeAndhra Pradeshప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ సర్వే పక్కాగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ సర్వే పక్కాగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశం

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి:పోలవరం జిల్లా 12 మండలాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ సర్వే పక్కాగా చేయాలని సంబంధిత అధికారులను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంకాలం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేతో, 12 మండలాలకు సంబంధించిన తాసిల్దారులతో, డిప్యూటీ తాసిల్దారులతో, మండల సర్వేర్లతో, సచివాలయాలకు సంబంధించిన సర్వేలతో, రోవర్స్ ప్రతినిధులతో రీ సర్వే వేగాంతం చేసేందుకు పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్, రంపచోడవరం రెవిన్యూ డివిజనల్ అధికారి కె. స్వాతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయుచున్న మీ భూమి మీ హక్కు భూ రీసర్వే కార్యక్రమం ప్రతి అధికారి సమన్వయంతో పనిచేసి రోజువారి లక్ష్యాలను తప్పనిసరిగా యాక్షన్ ప్లాన్ ప్రకారం అధిగమించాలని ఆయన అన్నారు. రోవర్ పరికరాల ద్వారా చేపడుతున్న రీ సర్వే డ్రోన్ ద్వారా సేకరించిన డేటాను గ్రౌండ్ ట్రూత్కింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో ఖచ్చితముగా ధ్రువీకరించాలని ఆయన అన్నారు. భూ సరిహద్దులు, సర్వే నెంబర్లు, రికార్డులు అదేవిధంగా వాస్తవ పరిస్థితులు పూర్తిగా సరిపోయేటట్టు ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి మండలంలో రోజువారి పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం టార్గెట్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రీ సర్వేలో ఏటువంటి జాప్యం లేకుండా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆయన అన్నారు. రైతుల నుండి వచ్చే అభ్యంతరాలను అదేవిధంగా ఫిర్యాదులను వెంటనే పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. రైతులు, భూమి యజమానుల తో సమన్వయం కొనసాగిస్తూ రిసర్వే ప్రక్రియ పారదర్శంగా నిర్వహించాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామంలో ఎన్ని ఎకరాలు సర్వే చేయవలసి ఉన్నది ఎంతమంది రైతుల భూములు సర్వే చేయవలసి ఉన్నది మండలాల వారిగా ఆయన ఆరా తీశారు. ఒక్కొక్క మండలంలో ఎన్ని రోవర్ పనిచేయుచున్నవి.

ఎన్ని సర్వే టీంలు పనిచేయుచున్నది మండలాల వారిగా ఆయన ఆరా తీశారు. సర్వే చేసిన గ్రామాలలో రైతులకు ప్రతి నెల మీ భూమి మీ హక్కు పట్టాలు పంపిణీ చేసే విధంగా ప్రతి మండలంలో తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని అన్ని మండలాల్లో వెబ్ లాండ్ చివరి దశ వరకు పోర్టింగ్లో ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజలో ఉండకుండా ఎక్కడికక్కడ సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆయన అన్నారు. ఫెజ్ వన్ ఫెజ్ టూ లో పెండింగ్ లో ఉన్న భూములకు రీసర్వ్ చేయాలనే ఆయన అన్నారు. ఆగస్టు చివరి నాటికి జిటి పూర్తి చేయాలని ఆయన అన్నారు. రీ సర్వే చేయు గ్రామాలలో రైతులందరినీ తెలియజేయాలని ఆయన అన్నారు. వారసత్వ భూములకు వారి కుటుంబ సభ్యులకు పేర్లు మ్యూటిషన్ కొరకు ఎటువంటి గొడవలు లేకుండా చాలా జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్ మాట్లాడుతూ చింతూరు డివిజన్ పరిధిలో రీ సర్వే యాక్షన్ ప్లాన్ ప్రకారం సర్వే చేయాలని ఆయన అన్నారు. రైతుల భూములలో హద్దులు నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇరువురు రైతుల సమక్షంలో హద్దులు వెయ్యాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో రీ సర్వే చేయు సమయంలో సర్వే టీం అందరూ అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ యం. శ్రీనివాసరావు, తాసిల్దారులు అమ్మాజీ, సిహెచ్ శ్రీనివాసరావు, కరక సత్యనారాయణ, సిహెచ్ బాలాజీ, తేజస్విని, స్వామి, శ్రీరాములు, సిహెచ్ శ్రీనివాసరావు, డిప్యూటీ సర్వేయర్లు యం. లక్ష్మణరావు, సరస్వతి అన్ని మండలాలకు సంబంధించిన వీఆర్వోలు, మండల సర్వేయర్లు, సచివాలయాలకు సంబంధించిన సర్వేర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular