HomeAndhra Pradeshముర్రం శివాని మృతి అత్యంత విషాదకరం… పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తాం జిల్లా కలెక్టర్: దినేష్...

ముర్రం శివాని మృతి అత్యంత విషాదకరం… పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తాం జిల్లా కలెక్టర్: దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ముర్రం శివాని బలవన్మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి , వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో శివాని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. స్వాతి, రంపచోడవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అశ్రఫ్ అలీతో కలిసి శివాని మృతికి సంబంధించిన పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఈ విధంగా కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్న కలెక్టర్, శివాని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యా న్ని భగవంతుడు ప్రసాదించాలని జిల్లా యంత్రాంగం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈకార్గియక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి జి. శ్రీరామ్ మూర్తి, ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular