పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ , నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష దేవి జిల్లా కలెక్టర్ వంటి వారు పాల్గొన్న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ మెగా పేరెంట్ -టీచర్స్ సభ కార్యక్రమంలో పాల్పంచుకున్న 10వ తరగతి గిరిజన విద్యార్థిని ముర్రం శివాని తన చక్కటి చాతుర్యం గల గల మాట్లాడుతూ ముఖ్యమంత్రి సైతం ఫిదా అయ్యేలా సభలో మాట్లాడిన విద్యార్థిని ఇలా మధ్యలోనే బలవన్మరణం చెందడంతో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తీవ్ర దిబ్బంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని ఉరి వేసుకుని మరణించిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శివాని తల్లిదండ్రులైన వర ప్రసాద్, సౌభాగ్యవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబసభ్యుల రోదన చూసి ఎమ్మెల్యే శిరీష దేవి కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యార్థిని భౌతిక కాయం పై పుష్ప గుచ్చం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

సహచర విద్యార్దులు శివానీ మృతదేహం చూసి ఒక్కసారిగా చలించి కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వారితో ఉన్న విద్యార్ధిని ఇకలేరు అనే మరణ వార్త తెలుసుకున్న తోటి విద్యార్దులు శోక సద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే శిరీష దేవి వెంట రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా బాపన్న దొర అనే బాబీ, కడబాల గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
