HomeUncategorizedడా. ఓమ్మి రఘురాంకు ఘనంగా జన్మదిన వేడుకలు

డా. ఓమ్మి రఘురాంకు ఘనంగా జన్మదిన వేడుకలు

రాజకీయాల్లో విద్యావంతుల పాత్ర ఎంతో అవసరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి


కాకినాడ జిల్లా, ఆగస్టు 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు డా. ఓమ్మి రఘురాం జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన కార్యదర్శి పాల్గొని డా. ఓమ్మి రఘురాంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ, డా. ఓమ్మి రఘురాం ఇప్పటికే 24 డిగ్రీలు పూర్తి చేసి, ప్రస్తుతం 25వ డిగ్రీని అభ్యసిస్తున్నారని, విద్యాపట్ల ఆయనకున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. విద్యతో పాటు సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, జీవితంలో పాఠాలు చెప్పే గురువు మాత్రమే కాకుండా మన ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే ప్రతి వ్యక్తి కూడా నిజమైన గురువేనని అన్నారు. గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా డా. ఓమ్మి రఘురాం ఆలోచనలు, ప్రసంగాలు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆయన సంకల్పం తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. సమాజంలో మార్పు కోసం కొందరు వివిధ మార్గాలను ఎంచుకుంటే, డా. ఓమ్మి రఘురాం “కలం”నే ఆయుధంగా ఎంచుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారా రాజకీయ వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. నేటి యువత ఇంజనీర్, డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నప్పటికీ, “ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు? ఎందుకు ఎంపీ కాకూడదు?” అనే ఆలోచన కూడా యువతలో రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను కేవలం విమర్శలు, కుట్రల వేదికగా కాకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యవస్థగా చూడాలని సూచించారు. డా. ఓమ్మి రఘురాం వంటి విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారా కొత్త ఒరవడి ఏర్పడుతుందని, సమాజానికి సమర్థవంతమైన నాయకత్వం లభిస్తుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో డా. ఓమ్మి రఘురాంకు ఉన్న సాన్నిహిత్యం భవిష్యత్తులో ఆయనకు మరింత ఉన్నత అవకాశాలను కల్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో డా. ఓమ్మి రఘురాం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా మంత్రిగా కూడా ప్రజలకు సేవలందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి విద్యావంతులను ప్రజలు ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొంటూ, ఆయనకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని కోరుతూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular