HomeAndhra Pradeshఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న రవాణాకష్టాలకు శాశ్వత విముక్తి, బీటీ రోడ్ల నిర్మాణానికి శాసనసభ్యురాలు శంకుస్థాపన

ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న రవాణాకష్టాలకు శాశ్వత విముక్తి, బీటీ రోడ్ల నిర్మాణానికి శాసనసభ్యురాలు శంకుస్థాపన

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రహదారుల నిర్మాణం లో ప్రాధాన్యత క్రమంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో పలు రహదారుల నిర్మాణానికి సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరి కాంతా రెడ్డి, పల్లాల వెంకట రెడ్డిల సౌజన్యంలో సాదరస్వాగతం పలికారు. ముందుగా వై.రామవరం మండలం గండేపల్లి నుండి సింహాద్రిపాలెం వరకు రూ; 49.01లక్షల వ్యయంతో మరియు గంగవరం మండలం మోహనపురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి శరభ వరం వరకు రూ;134.50 లక్షల వ్యయంతో బీటీ రోడ్లు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పీఎం -జన్మన్ నిధులతో చేపట్టే ఆయా నిర్మాణాలు కూటమి శ్రేణులు దగ్గరుండి పూర్తి నాణ్యతతో చేయించుకోవాలని సూచించారు. గుత్తేదారులు, నిర్మాణ పర్యవేక్షణ శాఖల వారు పూర్తి స్థాయిలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయా నిర్మాణాల్లో ఎలాంటి నాణ్యత ప్రమాణాల లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.

ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మారన గ్రామీణ లింక్ రోడ్ల రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికే చాలా మట్టుకు రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాలకు అంతర్గత మరియు బాహ్య రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రధాన కూడళ్ల నుండి గ్రామాలకు వెళ్లే మట్టి రోడ్లను బీటీరోడ్లుగా, అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా, గడువులోగా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో స్వయంగా కూటమి శ్రేణులు పనిచేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఆయా కార్యక్రమాల్లో పలు వినతులు రాగా స్పందించిన ఆమె సంబంధిత అధికారులు చరవాణీలో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి, వై.రామవరం మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరి కాంతరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఈకా బుల్లికొండలు దొర, ప్రధాన కార్యదర్శి కనిగిరి సుభాష్, కుంజం చిన్నాలు దొర,, తెలుగుదేశం నాయకులు మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ పల్లాల వెంకటరమణ రెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు, రావడి పుష్పరాజ్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు ముచ్చకర్ల శివ,కింటుకూరి రాంబాబు, మద్దికొండ ప్రసాద్, జి.చిన్నారావు, మాజీ జడ్పీటీసీ మద్దేటి వెంకటరెడ్డి, బొగ్గుల రెడ్డి, , పి .ఆదినారాయణ, బూత్ ఇంచార్జి బొగ్గుల సత్తిబాబు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular