HomeAndhra Pradeshరంప నియోజవర్గంలో ముమ్మరంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పాల్గొన్న: ఎమ్మెల్యే శిరీష దేవి

రంప నియోజవర్గంలో ముమ్మరంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పాల్గొన్న: ఎమ్మెల్యే శిరీష దేవి

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: విధ్వంసం నుండి వికాసం వైపు నడిపిస్తున్న చరిత్ర కూటమి ప్రభుత్వానికే సొంతమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ సంక్షేమ కమిటి చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు మిరియాల శిరీషాదేవి అన్నారు. గంగవరం మండలం మోహనపురం , శరభవరం మరియు వై.రామవరం మండలం గండేపల్లి , సింహాద్రిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి& పొత్తూరి కాంతరెడ్డిల నేతృత్వంలో రెండేళ్ళ నమ్మకం, సంక్షేమం అభివృద్ధిపై “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రతీ ఇంటింటికీ వెళ్ళి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాలను అందిస్తూ అవగాహన కల్పించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి నట్టేటముంచారన్నారు. విపత్కర పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి సారధ్యంలో దేశం గర్వించేలా అమరావతిని ఎకనామిక్ రీజియన్ గా మార్చిన ఘనత కూటమిదే అన్నారు. మేనిఫెస్టో లో ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మాట ఇచ్చిన ప్రకారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు పెంచి అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు పేర్కొన్నారు. 269 అన్నా క్యాంటీన్ లు ఏర్పాటు చేసి రూ;5/- లకే భోజనం అందిస్తున్న చరిత్ర మన కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రాజముద్రతో పట్టదారు పాసుపుస్తకాలు అందించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. గృహిణులకు సంవత్సరానికి దీపం పథకం ద్వారా అందించే 3 గ్యాస్ సిలిండర్ లు రాయితీలుపై చైతన్యం చేశారు. గత ప్రభుత్వం అమ్మవడి పథకం ద్వారా ఒక ఇంట్లో చదువుకునే అందరికీ అమలు చేస్తామన్న జగన్ కేవలం ఒక విద్యార్ధికి మాత్రమే అమలు చేయడం సిగ్గుచేటన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరి పిల్లలకు తల్లికి వందనం పథకం పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

చేనేతలకు, నాయి బ్రాహ్మణులకు ఉచితం విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతన్న కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా, వగైరా అవసరమైన ఎరువులు సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వారి వ్యవసాయ పనులు పెట్టుబడులకు అందజేసే అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా ఎలాంటి తారతమ్యం లేకుండా నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా అభివృద్ధిని కూడా పారదర్శకంగా అత్యంత వేగంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన అందిస్తున్న విధానాలపై చైతన్యం చేశారు. అలాగే సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి ఆయా సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవలో భాగంగా రూ;15000/- లు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారు కూడా పథకాలకు దూరం కాకుండా ఆయా శాఖల అధికారులు అర్హులైన వారి జాబితా సిద్ధంచేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఇప్పటికే 5 లక్షల గృహాలు పేదలకు అందించా మన్నారు. మత్స్యకారుల సేవలో భాగంగా ఏటా రూ;20,000/- లు అందిస్తున్నట్లు తెలిపారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రాయితీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 31 లక్షల ప్రయాణాలు కల్పించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆయా పథకాల్లో ఎక్కడ ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ప్రతీ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి అమలు చేసే బాధ్యతను తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పలు సమస్యలపై ఆమెకు వినతులు రాగా స్పందించిన ఆమె ఆయా శాఖల అధికార యంత్రాంగానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి, వై.రామవరం మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరి కాంతరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఈకా బుల్లికొండలు దొర, ప్రధాన కార్యదర్శి కనిగిరి సుభాష్, కుంజం చిన్నాలు దొర,, తెలుగుదేశం నాయకులు మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ పల్లాల వెంకటరమణ రెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు, రావడి పుష్పరాజ్, టి ఎన్ ఎస్ ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు ముచ్చకర్ల శివ,కింటుకూరి రాంబాబు, మద్దికొండ ప్రసాద్, జి.చిన్నారావు, మాజీ జడ్పీటీసీ మద్దేటి వెంకటరెడ్డి, బొగ్గుల రెడ్డి, , పి .ఆదినారాయణ, బూత్ ఇంచార్జి బొగ్గుల సత్తిబాబు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular