విజయనగరం జిల్లా బొబ్బిలి జిల్లావాణి ప్రతినిధ:-బొబ్బిలి మున్సిపాలిటీ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సూచనలు మేరకు 28 వార్డు గంగులువీది,29వార్డు పాకీవీది,వేవర్స్ కాలనీ అంగన్వాడి కార్యకర్త హుస్సేన్ సెంటర్లో తల్లి పాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు..కార్యక్రమంలో తల్లులు,గర్భిణీలకు సూపర్ వైజర్ రమాదేవి గారు పాల్గొని పుట్టిన పిల్లలకు ముర్రుపాలు పట్టాలని,తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా అని సూపర్ వైజర్ తల్లులకు,గర్బీణీలకు సూచించారు..పిల్లలు పుట్టిన ఆరు నెలలు వరకు తల్లిపాలు ఇవ్వాలని అప్పుడు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు..అలాగే బాలింతలు,గర్భిణీలు క్రమం తప్పకుండా మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు..ముఖ్యంగా పండ్లు,ఆకు కూరలు, పాలు,తినాలని సూచించారు..అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు..అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహార ప్రదర్శన ఏర్పాటు చేసారు..ఈ కార్యక్రమంలో అంగన్వాడి రెండవ సెంటర్ సూపర్ వైజర్ రమాదేవి,28,29వార్డు అంగన్వాడి గంగులు వీధి కార్యకర్త నాగమణి,పాకీవీది అంగన్వాడి కార్యకర్త గౌరి,వేవర్స్ కాలనీ అంగన్వాడి కార్యకర్త హుస్సేన్,మరియు అధిక సంఖ్యలో గర్భిణీలు,బాలింతలు,ఆశావర్కర్లు,ఏ.ఎన్.ఎం,లు తదితరులు పాల్గొన్నారు..
