అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా గజ్జి సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పచ్చిగోళ్ళ ఈశ్వరరావును నియమించారు. జిల్లా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రోలుగుంటలో జరిగిన నూతన మండల కమిటీ నియామక కార్యక్రమానికి సీనియర్ నాయకులు పొన్నగంటి అప్పారావు, రోలుగుంట ఇన్చార్జ్ దూది రాజేష్, అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ రమణమూర్తి, నాగేశ్వరరావు తదితరులు హాజరై నూతన పదాధికారులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మామిడి రమణ, వైస్ ప్రెసిడెంట్ చిటికెలు వెంకటరమణ, చోడవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కర్రి తమ్మి నాయుడు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, యువ మోర్చా విభాగం నుంచి రెడ్డి త్రిమూర్తులుతో పాటు వివిధ మోర్చాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
