HomeUncategorizedవైసిపి పార్టీ డీఎస్సీ పై అసత్య ప్రసారాలు మానుకోవాలంటున్న రోలుగుంట తెదేపా ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ.

వైసిపి పార్టీ డీఎస్సీ పై అసత్య ప్రసారాలు మానుకోవాలంటున్న రోలుగుంట తెదేపా ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ.

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని బూటకపు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంట తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను మభ్యపెట్టడమే ధ్యేయమా?: గత ఐదేళ్ల పాలనలో డీఎస్సీ నిర్వహణను గాలికి వదిలేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, నేడు ధర్నాల పేరుతో దొంగ నాటకాలు ఆడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేలాది ఉద్యోగాల భర్తీకి పారదర్శకంగా అడుగులు వేస్తుంటే ఓర్వలేక లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.ధర్నాలో ఉన్నది అభ్యర్థులా? వైకాపా కార్యకర్తలా?: రోలుగుంటలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనల్లో అసలైన డీఎస్సీ అభ్యర్థుల కంటే వైఎస్సార్‌సీపీ జెండాలు పట్టుకున్న రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు.గత ఐదేళ్ల అక్రమాలు, అప్పుల భారం గురించి ప్రజలకు బాగా తెలుసని, ఇకనైనా వైకాపా నాయకులు అబద్ధపు ప్రచారాలు స్వస్తి చెప్పి వాస్తవాలను గ్రహించాలని ఎంపీటీసీ రామకృష్ణ హితవు పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular