HomeUncategorizedరోలుగుంటలో వైఎస్ఆర్సిపి రిలే నిరాహార దీక్ష. ముఖ్యఅతిథిగా అమర్నాథ్.

రోలుగుంటలో వైఎస్ఆర్సిపి రిలే నిరాహార దీక్ష. ముఖ్యఅతిథిగా అమర్నాథ్.

డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.

కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోలుగుంటలో వైఎస్ఆర్సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో అవినీతి, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయంపై న్యాయమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యాదీవెన, వసతి దీవెన పథకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డిగ్రీలు పూర్తి చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.యువత, విద్యార్థుల హక్కుల సాధన కోసం అన్ని మండలాల్లో నిరాహార దీక్షలు చేపడుతున్నామని, ఈ నెల 10న చోడవరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాస్, జెడ్పీటీసీ పోతల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు, తమరాన వెంకటరమణ, మాజీ సర్పంచ్, మడ్డు అప్పలనాయుడు, చెట్టుపల్లి వెంకటరావు, జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి గుర్రాల నాగేశ్వరరావుతో పాటు మండల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular