

స్థానిక శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సావిత్రి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు అభయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హైస్కూల్ విద్యార్థిలకు మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సోషల్ మీడియా పరిచయాలు మరియు అనర్ధాలు గురించి వివరించడం జరిగింది. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలనే విషయం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ డీన్ దత్తు ఇంచార్జిలు లోవేశ్వరరావు ఏవో ప్రకాష్ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
