HomeUncategorizedజగ్గంపేటలో ఘనంగా ‘వనం మనం’కార్యక్రమం

జగ్గంపేటలో ఘనంగా ‘వనం మనం’కార్యక్రమం

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు

జగ్గంపేట, ఆగస్టు 12: నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (NHRPF) సీఈఓ తూము రామచంద్ర నాయుడు ఆదేశాల మేరకు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం.వి. రాఘవ అధ్యక్షతన “వనం మనం” కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని గుర్రపాలెం, మర్రిపాక గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. గుర్రపాలెం గ్రామంలో రాష్ట్ర ఇన్‌చార్జి వల్లీ ఖాన్ ఆధ్వర్యంలో, మర్రిపాక గ్రామంలో మండల ప్రెసిడెంట్ కాపవరపు బాబ్జి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండల ఎంపీడీవో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లా అడిషనల్ సెక్రటరీ కే. ప్రసాద్తో పాటు సచివాలయ సిబ్బంది, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో “వనం మనం” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular