జగ్గంపేట, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజనల్ కార్యాలయం నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర త్యాగ ఫలాలను సిబ్బందికి వివరించారు… ఈ కార్యక్రమంలో జగ్గంపేట డివిజన్ స్థాయిలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో జగ్గంపేట సెక్షన్ విద్యుత్ కార్మికులు సిబ్బంది మరియు తెలుగు నాడు యూనియన్ 1245 రీజనల్ సెక్రటరీ సత్యనారాయణ, రీజినల్ ప్రెసిడెంట్ గణేష్, డివిజన్ ప్రెసిడెంట్ శివ ప్రసాద్, మరియు 1104 యూనియన్ నాయకులు శ్రీనివాస రాజు, నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.

