జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠం శెట్టి సూర్యచంద్ర
గండేపల్లి, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు లిఫ్ట్పు పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణానికి సుమారు 52 కోట్లతో పాత సిమెంట్ పైప్‌లైన్ స్థానంలో ఎంఎస్ పైప్‌లైన్ ఏర్పాటు, పంప్‌హౌస్, విద్యుత్ సబ్‌స్టేషన్ తదితర పనులు చేపట్టారు.ఈ పనులు వాస్తవానికి వేసవికాలంలో పూర్తిచేసి, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు నీరు అందించాల్సి ఉంది.అయితే వేసవిలో పూర్తి చేయాల్సిన పనులను వర్షాకాలంలో చేపట్టడం,పనుల్లో వేగం లేకపోవడం వల్ల నేడు వేలాది ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని సూర్యచంద్ర తెలిపారు.**2025 సెప్టెంబర్ 10న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, డిసెంబర్ 10 నాటికి టెక్నికల్ శాంక్షన్, టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు, 2026 ఫిబ్రవరి 6 నుంచి పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా సంబంధిత కాంట్రాక్టర్ మెగా కంపెనీ వారికి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే పనులు ప్రారంభించిన తరువాత కూడా వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సమృద్ధిగా వినియోగించలేదని ఆయన విమర్శించారు.మే 7వ తేదీన తాము పుష్కర పనులను స్వయంగా పరిశీలించినప్పుడు, మూడు నెలల్లో కేవలం సుమారు 10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన సమయంలో 90 శాతం పనులు పూర్తి చేయడం కష్టమని ముందుగానే అధికారులు, ఎమ్మెల్యే గారి దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్లామని సూర్యచంద్ర తెలిపారు.ఆ సమయంలో కేవలం రెండు ప్రొక్లెయినర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, కనీసం 20 ప్రొక్లెయినర్లు, హైడ్రాలు తదితర యంత్రాలను వినియోగించి యుద్ధప్రాతిపదికన పాత పైపులు తొలగించి కొత్త పైపులు ఏర్పాటు చేయాలని కోరామని ఆయన చెప్పారు.అప్పుడే పనులను వేగవంతం చేసి ఉంటే నేడు రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు.**మే 13న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు పుష్కర పథకాన్ని పరిశీలించి,మే 19న విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారని సూర్యచంద్ర తెలిపారు.లోకేష్ పర్యటన రద్దు కావడంతో మే 19న ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి, జూలై 20 నాటికి తప్పనిసరిగా రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.జూలై 20న పనులను పరిశీలించిన తరువాత కూడా పనులు ఆలస్యంగా ప్రారంభమైనందున పూర్తి కాలేదని, ఆగస్టు 15 నాటికి తప్పనిసరిగా నీరుఅందిస్తామని మరోసారి హామీ ఇచ్చారని తెలిపారు.ఎమ్మెల్యే గారి హామీని నమ్మిన రైతులు నారుమడులు వేసుకున్నారని,ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ బిందెలతో నీరు పోసి నారుమడులను కాపాడుకునే ప్రయత్నం చేశారని, అనేక నారుమ డలు ఇప్పటికే ఎండిపోయాయని సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ పనులకు శంకుస్థాపన ఫిబ్రవరి నెలలోనే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా నిర్వహించి ఉంటే, వేసవి కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉండేదని సూర్యచంద్ర అన్నారు.ఇరిగేషన్ పనులకు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలనే నిర్ణయం కారణంగా సమయం వృథా అయిందని ఆయన విమర్శించారు* *క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మొదటి పైప్ లైన్ పూర్తి కావడానికి మరో 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని, రెండవ పైప్ లైన్ రెండు నుండి మూడు నెలలు కాలం పట్టే పరిస్థితి ఉందని సూర్యచంద్ర తెలిపారు.అదేవిధంగా ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, పంప్‌హౌస్ పనులు కూడా పూర్తిస్థాయిలో పూర్తికాలేదని ఆయన పేర్కొన్నారు**రెండు పైప్‌లైన్లు పూర్తయి, మొత్తం ఐదు మోటార్లను నడిపితే సుమారు 8 క్యూమెక్స్ అంటే సెకనుకు 8,000 లీటర్ల నీరు విడుదలవుతుందని సూర్యచంద్ర తెలిపారు.మొదటి పైప్‌లైన్‌లో రెండు మోటార్లతో సుమారు 3.20 క్యూమెక్స్ అంటే సెకనుకు 3,200 లీటర్ల నీరు మాత్రమే అందే అవకాశం ఉంటే, రెండవ పైప్‌లైన్ పూర్తికాకుండా మొత్తం 32,000 ఎకరాల ఆయకట్టుకు అవసరమైన స్థాయిలో సాగునీరు ఎలా అందిస్తారో అధికారులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారూ రైతులకు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు**రైతులను నమ్మించి నారుమడులు వేయించారు గత ఆరు నెలలుగా ఈసంవత్సరం పుష్కర ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని, రైతులు నారుమడులు సిద్ధం చేసుకోవాలని పదేపదే చెప్పడంతో రైతులు ఎమ్మెల్యే గారి హామీలను నమ్మారని సూర్యచంద్ర తెలిపారు రైతులు నారుమడులు వేసుకున్న తరువాత వర్షాలు సకాలంలో పడకపోవడంతో,ఎండలకు నారుమడులు ఎండిపోకుండా బిందెలతో నీరు పోసి కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇప్పుడు పుష్కర పనులు పూర్తికాకపోవడంతో వేలాది ఎకరాలకు నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు**రైతులకు ఎకరాకు రూ.20 వేల ఆర్థిక సహాయం ప్రకటించాలి**ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి చెరువుల్లో కూడా తగినంత నీరు లేకపోవడం, మరోవైపు పుష్కరఎత్తిపోతల పథకం పనులు పూర్తికాకపోవడంవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని సూర్యచంద్ర తెలిపారు.మొదటి పైప్‌లైన్ ద్వారా పరిమితంగా నీరు అందించినా, రెండవ పైప్‌లైన్ పూర్తికావడానికి మరింత సమయం పట్టే పరిస్థితిలో వేలాది ఎకరాల్లో రైతులు నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.ఈ సంవత్సరం పుష్కర సాగునీరు అందక నష్టపోయే ప్రతి ఎకరాకు రైతుకు రూ.20,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు ఈ అంశాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 20వ తేదీతో ముగిసేలోపు జగ్గంపేట నియోజకవర్గ పుష్కర ఆయకట్టు రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాగునీరు అందని ప్రతి ఎకరాకు రూ.20 వేల ఆర్థిక సహాయం ప్రకటించేలా ముఖ్యమంత్రి గారిని కోరాలని ఎమ్మెల్యే గారిని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు


