పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, సోషల్మీ డియాలలో వేధింపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం డివిజనల్ ఓఎస్డి ఎం.జావలి అల్ఫోన్స్ పేర్కొన్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఓ ఎస్ డి బుధవారం మండల ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలో స్థానిక సర్కిల్

ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరావు సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాలో విద్యార్థినులతో ఓఎస్టీ జావలి అల్ఫోన్స్ ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా చట్టాలు, సైబర్ క్రైమ్ వంటి వాటి పై ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని ఆమె పని చూసలను సలహాలు తెలియజేశారు. మహిళా చట్టాలు, సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాల నియంత్రణపై విద్యార్ధినీ విద్యార్ధలకు పూర్తిస్థాయి అవగాహ ఉండాలని పోలవరం ఓఎస్టీ ఎం.జావలి అల్ఫోన్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రాజవొమ్మంగి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
