HomeAndhra Pradeshలిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భద్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్: దినేష్ కుమార్

లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భద్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్: దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి : పోలవరం ప్రాజెక్టు పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లెఫ్ట్ కెనాల్ నీటి మల్లింపు పనులు వేగవంతం చేసే విధంగా సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం దేవి పట్నం మండలం నేలకోట పోలవరం

ప్రాజెక్టు కు సంబంధించిన పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నీటి మళ్లింపు కెనాల్ పనులను జల విద్యుత్ శాఖ ఇంజనీర్లతో పోలవరం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్ మాట్లాడుతూ దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు

పరిధిలోని నేలకోట ద్వారా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా లెఫ్ట్ కెనాల్ కు నీటి సరఫరా చేసే పైపులైన్లను పరిశీలించారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సంబంధించిన పనులు వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటిని సరఫరా చేసే పైప్లైన్ల

సమస్యలు ఏమైనా ఉన్న ఎడల సంప్రదించాలని ఆయన అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భద్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆయన అన్నారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్

స్కీమ్ పనులు నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆయన అన్నారు. కలెక్టర్ వారి వెంట ఓ ఎస్ డి జావలి, తహసిల్దార్ కే సత్యనారాయణ, జల విద్యుత్ ప్రాజెక్ట్ అధికారులు,క్రిష్ణ, డి ఈ శ్రీనివాసరావు,ఇంజనీర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular