HomeUncategorizedఒక పలకరింపు… ఒక భరోసా… ఒక జీవితాంతపు జ్ఞాపకం ❤️.... ఒమ్మి రఘురాం

ఒక పలకరింపు… ఒక భరోసా… ఒక జీవితాంతపు జ్ఞాపకం ❤️…. ఒమ్మి రఘురాం

తాడేపల్లిగూడెం వై ఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన ఒమ్మి రఘురామ్

తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన ఒక ఆత్మీయ కలయిక… ఒక నాయకుడు–కార్యకర్త మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు, కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు ఒమ్మి రఘురామ్, జగ్గంపేట జడ్పీటీసీ బిందు మాధవి రఘురామ్ కుటుంబ సమేతంగా కలిశారు. భార్య, కుమార్తెతో కలిసి జగన్ గారిని కలిసిన ఆ క్షణం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఒమ్మి రఘురామ్ పేర్కొన్నారు.మమ్మల్ని చూసిన వెంటనే జగన్ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి, “ఎలా ఉన్నారు? కుటుంబం ఎలా ఉంది?” అంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం తమను ఎంతో ఆనందానికి గురిచేసిందని తెలిపారు. అదే సమయంలో పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సంక్షేమం, వారి సమస్యల గురించి కూడా జగన్ గారు ఆత్మీయంగా అడిగి తెలుసుకోవడం తనను మరింతగా ఆకట్టుకుందని చెప్పారు. నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిలా పలకరించి, కార్యకర్తల బాగోగులను తెలుసుకోవడం వెనుక ఉన్న ఆత్మీయత తన మనసును తాకిందని రఘురామ్ పేర్కొన్నారు. కొన్ని కలయికలు కేవలం కలయికలు కావు… అవి నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. కొన్ని మాటలు కేవలం మాటలు కావు… అవి ముందుకు సాగేందుకు స్ఫూర్తిని అందిస్తాయి. కొన్ని పలకరింపులు కేవలం పలకరింపులు కావు… “నేను మీతో ఉన్నాను” అనే భరోసాను కలిగిస్తాయి. జగన్ గారి ఆప్యాయత తనకు ఇచ్చిన ఆనందాన్ని మాటల్లో పూర్తిగా చెప్పలేనని ఒమ్మి రఘురామ్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్ధత, వైఎస్సార్ కుటుంబం పట్ల తన ఆత్మీయత, జగన్ గారి నాయకత్వంపై తన విశ్వాసం ఈ కలయికతో మరింత బలపడ్డాయని చెప్పారు. పదవులు మారవచ్చు… పరిస్థితులు మారవచ్చు… కాలం మారవచ్చు… కానీ నమ్మకం మారకూడదు. నిబద్ధత తగ్గకూడదు. ఆత్మీయత మరువకూడదు. అనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నాయకుడి ఆప్యాయత కార్యకర్తకు బలాన్ని ఇస్తుందని, నాయకుడి నమ్మకం కార్యకర్తకు ధైర్యాన్ని ఇస్తుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని రఘురామ్ అన్నారు. తాడేపల్లిలో జగన్ గారితో జరిగిన ఈ ఆత్మీయ కలయిక తన రాజకీయ ప్రయాణంలో మరో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, తన నిబద్ధతకు మరింత బలాన్ని ఇచ్చిందని, హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. “నమ్మిన నాయకుడి కోసం…నమ్మిన సిద్ధాంతం కోసం…ప్రజల కోసం…నిబద్ధతతో ముందుకు సాగుతూనే ఉంటాను.”— ఒమ్మి రఘురామ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular