
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
పాయకరావుపేట నియోజకవర్గం టిడిపి కన్వీనర్, మంచికి మారు పేరుగా నీతి నిజాయితీలతో రాజకీయం చేస్తూ నియోజకవర్గం లోనే ఉన్నత స్థానంలో ఉన్న మా నాయకుడు కొప్పిశెట్టి వెంకటేష్ పై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని టీడీపీ పట్టణ అధ్యక్షులు అడ్డూరి లోవరాజు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో చేయని తప్పుకి శిక్ష అనుభవించి సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్న ఇంటిని సైతం అమ్ముకునే పరిస్థితి వచ్చినా నమ్మిన ప్రజలకోసం నీతిగా బతుకుతున్న వెంకటేష్ పై ఇలాంటి అభియోగాలు రావడం తగదన్నారు. మా నాయకుడు ఎదుగుతున్న తీరును చూసి రాజకీయంగా ఎదుర్కోవాలి కాని ఇలా అసత్య ఆరోపణలు సరికాదన్నారు. హోం మంత్రి ఇలాకాలో అవినీతి జరిగిందనే తప్పుడు ప్రచారం మానుకోవాలని గత ప్రభుత్వం లో జరగని అభివృద్ధి ఇప్పుడు పరుగులు పెట్టడం చూడాలన్నారు.
