

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా
అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ..
అనకాపల్లి జిల్లా: ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఎలమంచిలి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ గారు.. ఆధ్వర్యంలో అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అచ్యుతాపురంలోని ఎమ్మెల్యే నివాసం (STBL) నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో ఎలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ఎలమంచిలి గుర్రప్ప కల్యాణ మండపానికి చేరుకుంది.
అనంతరం గుర్రప్ప కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, గారు.జనసైనికులు కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువజన విభాగం నూతన లోగోతో పాటు ప్రత్యేక గీతాన్ని కూడా పరిచయం చేశారు.
అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభపరిణామం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను అందించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు.
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే గారు.పేర్కొన్నారు. అభివృద్ధి, సంపద సృష్టి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు.
రూ.1,500 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఎలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తెలిపారు. నియోజకవర్గాన్ని సుమారు రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసైనికులు తదురులు పాల్గొన్నారు…
