HomeAndhra Pradeshలోతట్టు ప్రాంతాల నుంచి దిగువకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:...

లోతట్టు ప్రాంతాల నుంచి దిగువకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ చినబాబు

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: నిర్విరామంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనీ ప్రజలు అత్యంత అప్రమత్తంగా జడ్డంగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు మీడియా ద్వారా కోరారు. రెండు రోజులుగా క్షణం విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ కొండ ప్రాంతల నుండి కిందకు వరద నీరు వచ్చి చేరడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ఇళ్లనుండి బయటకు వానలు తగ్గేంతా వరకు రావద్దని సూచించారు. అంతేకాకుండా గ్రామాల్లో ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఎవరికైనా కంటబడితే వెంటనే తమకు సమాచారం అందించాలని చినబాబు తెలిపారు. ఈ క్రమంలో తన స్టేషన్ పరిధిలోని పలు వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాలను ఎస్ఐ గురువారం వెళ్లి సందర్శించి, ఆయా ప్రాంతాలాలోని ప్రజలను ముందస్తు జాగ్రత్తలను చినబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలీసు సిబ్బంది ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments