పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ప్రభుత్వన్నీ కోరారు. ఈ మేరకు ఆయన సమస్యలతో కూడిన ఒక మెమొరాండం వినతి పత్రాన్ని స్థానిక ఎస్టీ కమిషన్ చైర్మన్ క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఎస్టి కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డికి అందజేశారు. ఆయన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఏర్పడిన పోలవరం జిల్లా వ్యాప్తంగా ఎల్.ని.నో వర్షాలు కురువకపోవడంతో వర్షాధారం మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ నిరు పేద రైతులు 2026 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వరి పంట గానీ సిరి ధాన్యాలు (మిల్లెట్స్) పంటల గానీ వర్షాలు కురువకపోవడంతో ఎక్కడ పంటలు వెయ్యలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులను వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి, అంచన వేసి పోలవరం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాపాడాలని ప్రభుత్వనికి కోరారు. ప్రజలు జీవనోపాధి కోసం సిరి ధాన్యాలు (మిల్లెట్స్) ఆదివాసీ పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని,వి.బి.జీ.రామ్.జి పథకం ద్వారా 200 రోజులు పని దినాలు కల్పించాలని, ఆదివాసీ నిరు పేద రైతులకు సోలార్ బోర్లు, సోలార్ పెన్సింగ్ 90 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితుల కు శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలని, టి.ఏ.సీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకే అర్హతను బట్టి ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీ యువతి యువకులకు 90 శాతం సబ్సిడీతో ట్రైకర్ రుణాలు మంజూరు చేయాలని కోరుతూ పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి దృష్టికి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,ఏపీ ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు మొదలైన వారు పాల్గొన్నారు.
పోలవరం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి, ఎస్టి కమిషన్ చైర్మన్ కు జేఏసీ రాష్ట్ర నాయకులు వినతి పత్రం అందజేతా!
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
