రావులపాలెం జిల్లా వాణి ప్రతినిధి:ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల సమ్మె నేపథ్యంలో అక్టోబర్ నెల సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని రావులపాలెం ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 1వ తేదీ ఉదయం పంచాయతీ అభివృద్ధి అధికారులు సంబంధిత బ్యాంకులకు వెళ్లి పింఛన్ నగదును డ్రా చేసుకున్న అనంతరం అదే రోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.సాధారణంగా నెల మొదటి తేదీ ఉదయం ప్రారంభమయ్యే పంపిణీ ఈసారి మధ్యాహ్నం నుంచి కొనసాగుతుందని, పింఛన్ లబ్ధిదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఎంపీడీఓ కోరారు.
