HomeUmmadi Alluri Zillaపర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించాలి:...

పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించాలి: కలెక్టర్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఏజెన్సీ పోలవరం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అందుబాటులో ఉన్న సహజ వనరులు, పర్యాటక అవకాశాలను సమర్థవంతంగా వినియోగించు కుని స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపాన్ కోయ ప్రతినిధుల బృందం మాస్టర్ ప్లాన్ వివరించడం జరిగింది. సోమవారం ఐటీడీఏ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో పర్యాటక అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించింది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, సిటీ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుల పరిధిలో అమరావతి–ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా ఉన్న మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో ప్రధానంగా చర్చించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో ఇప్పటికే గుర్తించిన పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు రహదారి అనుసంధానం, రవాణా సౌకర్యాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.పోలవరం ఐలాండ్ బ్రిడ్జి సమీపంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రతిపాదన పరిశీలనలో ఉందని, సుమారు 400 ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించినట్లు కలెక్టర్ తెలియ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలు, సదుపాయాల ఆధునీకరణతో పాటు ఎక్స్‌ప్రెస్‌వే మార్గానికి అనుసంధానంగా కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు.జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనల రూపకల్పనలో జిల్లా యంత్రాంగం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, జిల్లా పర్యాటక అధికారి దాసు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపాన్ కోయ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments