HomeUncategorizedజగ్గంపేటలో హోరెత్తుతున్న కూటమి ప్రచార హోరు - 6వ వార్డులో దూసుకుపోతున్న మారిశెట్టి గంగాధరరావు

జగ్గంపేటలో హోరెత్తుతున్న కూటమి ప్రచార హోరు – 6వ వార్డులో దూసుకుపోతున్న మారిశెట్టి గంగాధరరావు

కాకినాడ జిల్లా, జగ్గంపేట, నవంబర్ 25 : జగ్గంపేటలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. జగ్గంపేట గ్రామపంచాయతీ 6వ వార్డు అభ్యర్థిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థి పాండ్రంకి సురేఖ రాంబాబు బలపరిచిన మారిశెట్టి గంగాధరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని వాటర్ కలుసుకొని ప్రెజర్ కుక్కర్ గుర్తుపై తమ అమూల్యమైన, పవిత్రమైన ఓటు మొత్తం వేసి అఖండ మెజార్టీతో 6వ వార్డు సభ్యుడిగా గెలిపించాలని, అదేవిధంగా జగ్గంపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాండ్రంకి సురేఖ రాంబాబుకు మంచం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డులోని మెయిన్ రోడ్డులో గల పలు షాపులను సందర్శించి ఓట్లు అభ్యర్థించారు. మమ్మల్ని గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మారిశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎన్నికల ప్రచారంలో రాయి సాయి, మారిశెట్టి గణేశ్వరరావు, కోడూరి రమేష్, మారిశెట్టి గణేష్, కేసు బోయిన నాగేశ్వరరావు, ఎస్ కోదండ రామారావు, గారపాటి సత్తిబాబు, దార్ల నానాజీ, బండారి సతీష్, పి రామాంజనేయులు, రెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments