పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో ఇటివలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన నూతన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు మరియు వార్డు మెంబర్లను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తన

అధికారిక పార్టీ క్యాంప్ కార్యాలయం తంటికొండ గ్రామపంచాయతీ ఒట్టిగడ్డలో గ్రామంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించడంతో ఆయా ప్రాంత మంత సందడి వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన దొరమామిడి, చేరుకోమ్ముపాలెం, జగ్గంపాలెం, జియంపాలెం, జడేరు, సురంపాలెం, నెల్లిపూడి, ఎండపల్లి, భయన్నపల్లి, పిడతమామిడి, గంగవరం, లక్కొండ, అమదాలబంధ, ధన్యంపాలెం గ్రామ పంచాయతీల సర్పంచులతో పాటు నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులందరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
