HomeUmmadi Alluri Zillaప్రమాదాలను నివారించేందుకు ముమ్మరంగా వాహన తనిఖీలు

ప్రమాదాలను నివారించేందుకు ముమ్మరంగా వాహన తనిఖీలు

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీసు స్టేషన్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు నేతృత్వంలో జాతీయ రహదారి నెంబర్ 516ఈ లో వచ్చిపోయే వాహనాలను ఆపి ముమ్మరంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా రవాణా నీమానిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సక్రమంగా పత్రాలు లేకుండా నడుపుతున్న వాహనాదారులకు ఆన్లైన్ పెనాల్టీలు విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు వాహనాలపై ప్రయాణించేటప్పుడు అందరూ బాధ్యతాయుతంగా రక్షణ కవచం “హెల్మెట్” తూచా తప్పకుండా పెట్టుకోవాలని ఎస్ఐ చినబాబు వాహనదారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని మైనర్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఇవ్వు నాదని విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాలు నిండకుండా వాహనాలు నడిపితే రవాణా చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వారిని హెచ్చరించారు. ఇదే క్రమంలో కార్లు నడిపేటప్పుడు సీటు దగ్గర ఉన్న సీటు బెల్ట్ను కచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments