HomeUncategorizedస్మగ్లర్లతో చేతులు కలిపిన ఫారెస్ట్ అధికారిపై ఉప ముఖ్య మంత్రి: పవన్ కల్యాణ్ సీరియస్

స్మగ్లర్లతో చేతులు కలిపిన ఫారెస్ట్ అధికారిపై ఉప ముఖ్య మంత్రి: పవన్ కల్యాణ్ సీరియస్

అమరావతి జిల్లావాణీ ప్రతినిధి :ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే వారు ఎవరైనా సరే, ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ‘ఆపరేషన్ అరణ్య’ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని ఆయన తెలిపారు.కడప జిల్లా అవధూత కాశినాయన మండలంలో శనివారం రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఆయన అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారుశనివారం తెల్లవారుజామున వరికుంట్ల గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బృందానికి అందిన కచ్చితమైన సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు. ఇంటి సామాగ్రి ముసుగులో బొలెరో మ్యాక్స్ ట్రక్కులో దుంగలను తరలిస్తున్న హర్యానాకు చెందిన సన్నీ, రమేశ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.విచారణలో భాగంగా, జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో పనిచేస్తున్న బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు తేలడంతో అతడిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు వెనుక బెంగళూరు, హర్యానా, కోల్‌కతా కేంద్రాలుగా పనిచేస్తున్న ప్రధాన సూత్రధారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడి పాత్రపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular