పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో శనివారం ఉదయం జాతీయ వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ-రామ్ జీ) పథకం మండల అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ నేతృత్వంలో 2026-27 నూతన హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో కొబ్బరి మొక్కల నాటే కార్యక్రమాన్ని ఏపీవో శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పరిసరాల్లో కొబ్బరి సాగు విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని అందించే పంటల సాగుతో రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావచ్చని అధికారులు సూచించారు.

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హార్టికల్చర్ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో పిలుపునిచ్చారు. హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉద్యానవన పంటల విస్తీర్ణం పెరిగి, రైతులకు స్థిరమైన ఆదాయ వనరులు లభి స్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిలు ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ, లబ్బర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్, చిట్టిబాబు, జి. రామ్జీ, ఫీల్డ్ అసిస్టెంట్ సత్తిబాబు, టెక్నికల్ అసిస్టెంట్ పార్వతి, శాఖ సిబ్బంది, రైతులు, గ్రామస్థులు పాల్గొ న్నారు.
