
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
నక్కపల్లి లోని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతాన్ని వేద పండితులు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. వ్రతానికి హాజరయ్యే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది సుమారు 4 వేల మంది మహిళలు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు వ్రత కార్యక్రమం ప్రారంభం కానుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధి నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఈ వ్రతంలో పాల్గొననున్నారు. వ్రతంలో పాల్గొనే మహిళల కోసం ప్రత్యేకంగా పాస్‌లను ఏర్పాటు చేశారు. పాస్ ఉన్న మహిళలకు మాత్రమే వ్రత ప్రాంగణంలోకి ప్రవేశం కల్పించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మహిళల రాక, కూర్చునే ఏర్పాట్లు, వ్రత నిర్వహణ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగే వరలక్ష్మీ వ్రతానికి పాయకరావుపేట నియోజకవర్గంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
