HomeAndhra Pradeshఅద్వాన స్థితిలో రోడ్లు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు తరలించడానికి ఫీట్లు, త్వరితగతిన రోడ్లు వేయాలన్న:...

అద్వాన స్థితిలో రోడ్లు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు తరలించడానికి ఫీట్లు, త్వరితగతిన రోడ్లు వేయాలన్న: పెద్దిరాజు

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో రెండు ప్రధాన రహదారులు దారుణంగా తయారవడం తో రోడ్లులేక అటుగా ప్రయాణించే గిరిజన ప్రాంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీఐఐసీ డైరెక్టర్, రాజవొమ్మంగి మండల అధికార తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గొల్లపూడి పెద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే మండల ప్రధాన కేంద్రం రాజవొమ్మంగి నుండి వయ్యాడా బోరుగుపల్లి వరకు, లబ్బర్తి ఆర్ అండ్ బి రోడ్డు నుండి డి.మల్లవరం వరకు ఉన్న రోడ్లు కేవలం మెటల్ రోడ్లుగానే ఉన్నాయన్నారు. సంవత్సరాలు గడుస్తున్న నేటికీ తారు రోడ్డు వేయకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన వారు రాకపోకల సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పెద్దిరాజు పేర్కొన్నారు. అనునిత్యం పలు సమస్యలపై మండల ప్రధాన కేంద్రానికి వచ్చే వారు ఈ మార్గాలగుండా ప్రయాణించాలంటే గిరిజన ప్రాంత ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని పెద్దిరాజు స్పష్టం చేశారు. ముఖ్యంగా తొలకరి వానలు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలు వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంత గ్రామాల్లోని ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన బడి వారిని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు తరలించడం పెద్ద పెను సవాలుగా మారుతోందని పెద్దిరాజు అన్నారు.

ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ లు, వాహనాలు ఈ మార్గం గుండా రాలేని పరిస్థితి నెలకొందన్నారు. బడులకెళ్ళే చిన్నారులు బురదలోనే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి చూస్తున్నామన్నారు. ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న సమస్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసుకుని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్, స్థానిక రంపచోడవరం మిరియాల శిరీష దేవి , జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వారు స్పందించి, తక్షణమే ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులకు రెండు రోడ్లకు తారు రోడ్డు వేయించాలని ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular