HomeAndhra Pradeshమూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!

మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు!

మలికిపురం/యలమంచిలి: అప్పుల బాధ తట్టుకోలేక.. మూడేళ్ల కుమారుడిని వంతెనపై వదిలేసిన దంపతులు గో­దావరి నదిలో దూకేశారు. వారి కోసం పోలీసులు, స్థానికులు నదిలో గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) కొంతకాలం వేల్పూరులో ఉన్నారు. డ్రైవర్‌గా పని చేసే సాయి అప్పుల పాలై, వాటిని తీర్చలేక కొన్నాళ్ల క్రితం భీమవరానికి వచ్చారు. వారికి మూడేళ్ల క్రితం కవల పిల్లలు బాబు, పాప జన్మించారు. ఇక్కడ కూడా అప్పుల బాధలు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయారు.గురువారం రాత్రి పాపను ఇంటి వద్దే వదిలి, బాబు­ను తీసుకొని స్కూటీపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య దిండి–చించినాడ వంతెనపైకి వచ్చారు. రాత్రి 9 గంటలకు స్కూటీ­ని, బాలుడిని వంతెనపై వదిలేసి, నదిలో దూకేశారు. స్థానికుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దంపతుల కోసం స్థానికులతో కలిసి నదిలో గాలిస్తున్నారు. ఎస్సై రాజ్‌కుమార్‌ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని యలమంచిలిలో ఉంటున్న బంధువులకు అప్పగించారు. సాయి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular