HomeAndhra Pradeshయూనిక్ పాఠశాలలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు...!

యూనిక్ పాఠశాలలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు…!


పెందుర్తి జిల్లావాణి ప్రతినిధి:విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఆదిత్య నగర్ లోని ఉన్న యూనిక్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి…300 మంది విద్యార్థులు అందరూ అతి పెద్ద రాఖీ ఆకారంలో నిలబడి అందరిని ఆశ్చర్యపరిచారు…ఇంత పెద్ద రాఖీ ఆకారంలో విద్యార్థులు నిలబడి ప్రదర్శన చేయడం ఇదే మొదటిది కావడం విశేషం…విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ఈ ప్రదర్శన చేయడంపైన హర్షం వ్యక్తం చేశారు…ఈ చక్కని ప్రదర్శన చేయించిన పాఠశాల డీన్ విశాలాక్షి మేడం ని అందరూ ప్రశంశించారు… పాఠశాలలో మొత్తం విద్యార్థులు అందరితో అమ్మాయిలు అందరూ అబ్బాయిలను వారి సోదరులు గా భావించి రాఖీ లు కట్టి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు…ఇటువంటి మంచి సంప్రదాయం పిల్లలకు తెలియజేసి కార్యక్రమం చేయడం చాలా బాగుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు…ఈ కార్యక్రమంలో ముఖ్య అతిది గా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కోనేటి ఆదినారాయణ నాని సార్ పాల్గొని ఈ రాఖీ పండగ యొక్క విశిష్టతను అందరికి వివరించారు… కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి కుమారి, ప్రశాంతి, కృష్ణవేణి, నీలిమ, లావణ్య, డాకినేశ్వరి, త్రివేణి, ఇందిరా, లక్ష్మి కళ్యాణి, శకుంతల, సత్యనారాయణ, మురళి కృష్ణ, అలివేలు,సంతోషి, పుష్ప,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular