HomeAndhra Pradeshరాజవొమ్మంగి మండలంలో లయసంస్థ ఆధ్వర్యంలో వనమూలిక కేంద్రం

రాజవొమ్మంగి మండలంలో లయసంస్థ ఆధ్వర్యంలో వనమూలిక కేంద్రం

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రాజవోమంగి మండలం లోని ముల్లిమెట్ల గ్రామంలో లయ సంస్థ ఆధ్వర్యంలో వనమూలిక వైద్య వనరుల కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కేంద్రంలో ఔషధ మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు రాజవోమ్మంగి మండలంలోని సాంప్రదాయ మూలికా వైద్యులు, ఆదివాసీ యువతకు ఆయుర్వేదం, వనమూలికా వైద్యంపై శిక్షణ ఇవ్వదానికి. అలాగే సాధారణ వ్యాధులకు అవసరమైన ఆయుర్వేద మందుల తయారీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

ఈకార్యక్రమానికి ఆదివాసీ సాంప్రదాయ మూలికా వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చెక్క మల్లి రెడ్డి, ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు తాము సూరిబాబు, మూలికా వైద్యులు సంక్రమయ్య, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజవోమ్మంగి, అడ్డతీగల, వై.రామవరం మండలాలకు చెందిన సుమారు 100 మంది మూలికా వైద్యులు పాల్గొన్నారు. సాంప్రదాయ మూలికా వైద్య పరిజ్ఞానాన్ని పరిరక్షించి, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో ఈ కేంద్రం కీలకంగా పనిచేస్తుందని గుగ్గిలపు బుల్లియ్య , పూసం మల్లుదొర తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular