అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జెపి అగ్రహారంలో: ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించుకునేందుకు జేపీ అగ్రహారం గ్రామస్తులు ముందుకు వచ్చారు. జేపీ అగ్రహారం నుంచి కుసర్లపూడి వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు గుంతలమయమై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన యువకులు, పెద్దలు కలిసి సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.గ్రామానికి రాకపోకలకు ప్రధాన ఆధారమైన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రమాదాల భయం నెలకొంది. సమస్యను అధికారులు పరిష్కరిస్తారంటూ ఎదురుచూడకుండా సుమారు 20 మంది గ్రామస్తులు తమ వంతుగా డబ్బులు సమకూర్చుకుని రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు బుచ్చిరాజు, విఆర్పి శీను సహాయకులుగా నిలిచి పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు వచ్చిన గ్రామస్తుల చర్యపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.“మన సమస్యకు పరిష్కారం కోసం ఎదురు చూడటం కాదు.. మనమే ముందడుగు వేయాలి” అనే ఆలోచనతో గ్రామస్తులు చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
