HomeUncategorizedపాయకరావుపేట జలహారతికి కొంతలం తెదేపా నాయకులు.

పాయకరావుపేట జలహారతికి కొంతలం తెదేపా నాయకులు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాయకరావుపేటలో నిర్వహించనున్న జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రోలుగుంట మండలం కొంతలం టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రోలుగుంట మండలంలోని 24 పంచాయతీల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మండలంలోని 24 పంచాయతీల నుంచి సుమారు 1,200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి తరలివెళ్లినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.అలాగే ప్రతి గ్రామం నుంచి సుమారు 50 మంది చొప్పున మహిళా నాయకులు, కార్యకర్తలు జలహారతి కార్యక్రమానికి తరలివెళ్లారు. పాయకరావుపేటలో నిర్వహించనున్న కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా రోలుగుంట మండల టీడీపీ అధ్యక్షుడు పంచాడ చంద్ర, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు గుమ్ములూరి చంద్రమౌళి, వీఆర్వో సీతారాం, పంచాయతీ సెక్రెటరీ రొంగల గోవింద, గూడెపు నానాజీ రాజన రాజబాబు నాయకులు, కార్యకర్తల తరలింపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పార్టీ శ్రేణులు పాల్గొని జలహారతిని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular