HomeUncategorizedనిరుపేద విద్యార్థులకు అండగా అనిమిరెడ్డి రమణ చదువులకు ఆర్థిక భరోసా.

నిరుపేద విద్యార్థులకు అండగా అనిమిరెడ్డి రమణ చదువులకు ఆర్థిక భరోసా.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామంలో: ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో బుచ్చింపేట గ్రామానికి చెందిన వార్డు కార్యదర్శి అనిమిరెడ్డి రమణ తన వంతు సహాయాన్ని కొనసాగిస్తున్నారు.గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి ఏటా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ రమణ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గ్రంధి మంజు, పిల్లి శ్రీ వాణి అనే విద్యార్థులకు ఇంటర్ ఫీజు చెల్లించి అండగా నిలిచారు.ఈ సందర్భంగా అనిమిరెడ్డి రమణ మాట్లాడుతూ.. “ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. నా స్థాయిలో నాకు సాధ్యమైనంత సహాయం చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తాను. భవిష్యత్తులోనూ ఈ విధమైన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తాను” అని తెలిపారు.నిరుపేద విద్యార్థుల విద్యకు అండగా నిలుస్తున్న రమణ సేవా కార్యక్రమాలపై గ్రామ ప్రజలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular