HomeUncategorizedవైసీపీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ శ్రేణులు.

వైసీపీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ శ్రేణులు.

అనకాపల్లి జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు, వైజాగ్ తూర్పు నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు జన్మదినం సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు ఆయనను కలిసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్, టౌన్ పార్టీ అధ్యక్షులు యాక శివప్రసాద్, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ తమరాన శ్రీనివాస్, టౌన్ ఉపాధ్యక్షులు సుర్ల అప్పలనాయుడు తదితరులు సన్యాసిపాత్రుడిని కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజా సేవలో కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular