
నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని ఉపమాక లో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ భువనేశ్వరి దేవి సమేత లక్ష్మణేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవము ( శివపార్వతుల కళ్యాణం ) ఘనంగా జరుపబడుతుంది అని ఆలయ పండితులు, ఉత్సవ కమిటీ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉపమాక శివాలయం వద్ద నుండి కోలాటం,స్వామి వారి భక్తులతో శివపార్వతుల పల్లకి,వాహనములు తో నక్కపల్లి బయలుదేరి వెళ్లి అక్కడ జరిగే పెళ్లి మాటలు కార్యక్రమం జరుగుతుంది.అనంతరం తిరిగి రాత్రి 9 గంటలకు ఉపమాక శివాలయానికి చేరుకున్న అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రారంభమగునని తెలిపారు.ఈ మేరకు స్వామివారి కళ్యాణo కు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. కార్యక్రమం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయబడునన్నారు.
