HomeUncategorizedజగ్గంపేటలో ఆధ్యాత్మిక చైతన్యం: భక్తిశ్రద్ధలతో ముగిసిన 'ఒక్కరోజు బైబిల్ తరగతులు'

జగ్గంపేటలో ఆధ్యాత్మిక చైతన్యం: భక్తిశ్రద్ధలతో ముగిసిన ‘ఒక్కరోజు బైబిల్ తరగతులు’

ముఖ్య వక్తగా విచ్చేసిన ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ కె. సత్య వేద సాగర్

జగ్గంపేట, ఏప్రిల్ 30:కాకినాడ జిల్లా జగ్గంపేట మండల కేంద్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని షాదీ ఖానా ఫంక్షన్ హాల్‌లో ‘క్రైస్ట్ చర్చ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు బైబిల్ తరగతులు అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరిగాయి. ఈ కార్యక్రమానికి జగ్గంపేట క్రైస్ట్ చర్చ్ ప్రతినిధి బ్రదర్ కె. అభి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. విశ్వాసమే క్రైస్తవ్యానికి పునాది: బ్రదర్ కె. అభి తొలి వర్తమానాన్ని అందించిన బ్రదర్ కె. అభి ‘విశ్వాసం’ అనే అంశంపై లోతైన వివరణ ఇచ్చారు. క్రైస్తవ్యంలో విశ్వాసం, నమ్మకం అనేవి అత్యంత ప్రాముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు.”మనం విశ్వాసులమని పిలవబడుతున్నామంటే, దేవుని యందు సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నామని అర్థం. అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే నిజమైన విశ్వాసం. మరణానంతరం పరలోక ప్రాప్తి కలగాలన్నా, దైవ నిరీక్షణతో కూడిన జీవితం గడపాలన్నా అచంచలమైన విశ్వాస స్థితి అవసరం,” అని ఆయన బోధించారు. యేసుక్రీస్తు భూమిపై ఉన్న కాలంలో మనుషుల విశ్వాస స్థితిని చూసి కొన్నిసార్లు ఆనందించారని, విశ్వాసం లేనప్పుడు బాధపడ్డారని చెబుతూ.. విశ్వాస స్థాయిని మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.దైవ బోధనలతోనే మానసిక ప్రశాంతత డాక్టర్ కె. సత్య వేద సాగర్ చాగల్లుకు చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త, డబ్ల్యూ.డబ్ల్యూ (W.W) మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ కె. సత్య వేద సాగర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి పాప విముక్తుడై వెలుగులోకి రావాలనే ఉద్దేశంతోనే దేవుడు గొప్ప త్యాగం చేశారని వివరించారు. బైబిల్ బోధనలను అనుసరించడం ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవనం సాధ్యమవుతుంది. అలజడితో కూడిన నేటి సమాజంలో దైవ వాక్యం ద్వారానే నిజమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటి వారిని ప్రేమించడం, సన్మార్గంలో నడవడమే క్రైస్తవ్యం యొక్క పరమార్థమని ఆయన పేర్కొన్నారు. తరలివచ్చిన విశ్వాసులు ఈ ఆధ్యాత్మిక సదస్సులో జగ్గంపేటతో పాటు పరిసర ప్రాంతాల నుండి క్రైస్తవ విశ్వాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దైవ సందేశాలతో పాటు, భక్తి గీతాలతో ఫంక్షన్ హాల్ అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ బ్రదర్ కె. అభి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular