జగ్గంపేట, మే 24:గంజాయి వాడకం, రవాణాపై జగ్గంపేట పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ (SP) శ్రీ బిందు మాధవ్ IPS ఆదేశాల మేరకు, పెద్దాపురం డీఎస్పీ ఎబిజీ తిలక్ పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు, ఎస్సై టి. రఘునాథరావు ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సాంకేతికతను జోడించి, అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ముమ్మర గస్తీ, తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాకు చిక్కితే కఠిన చర్యలు!ఈ సందర్భంగా జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు మాట్లాడుతూ.. గంజాయి సేవించినా, రవాణా చేసినా లేదా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా డ్రోన్ కెమెరాల నిఘాలో సులువుగా దొరికిపోతారని హెచ్చరించారు. పోలీస్ నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగంజాయి వాడకం, విక్రయాలు లేదా రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చేందుకు కింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు: జగ్గంపేట సీఐ: 9440796529 జగ్గంపేట ఎస్సై: 9440796569 ముఖ్య సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, కాబట్టి ప్రజలు భయం లేకుండా గంజాయి నిర్మూలనకు సహకరించాలని ఎస్సై రఘునాథరావు పిలుపునిచ్చారు.

