పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండల పరిధిలోని ఐ.పోలవరం గ్రామపంచాయతీ జాగరంపల్లి సమీపంలోని ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభించడం జరిగింది. నేటికీ ఫ్యాకల్టీ నియమించకపోవడంతో ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సులకు సంబంధించిన భవనం ఫ్యాకల్టీ లేక, విద్యార్థులు లేక కొత్త భవనం శిధిలావ్యవస్థలో మారుతుందని మాజీ టీడీపీ అధ్యక్షుడు కారంసురేష్ బాబు ఆరోపించారు. వెంటనే స్థానిక స్థానిక ఉన్నత అధికారులు స్పందించి టెక్నికల్ కోర్స్ కళాశాలను గిరిజన ప్రాంతంలో బోధన చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. ఇక్కడ మన్యంలో కళాశాల అందుబాటులో లేక, మైదాన ప్రాంతంలో వసతులు లేక అక్కడ ఆదివాసీ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని సురేష్ బాబు వాపోయారు. ఇక్కడున్న అధికారులు స్పందించి ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిక అందజేసి శిధిలా వ్యవస్థగా మారుతున్న పాలిటెక్నిక్ కళాశాలను పునరుద్దారించాలని కారం సురేష్ బాబు అధికారులకు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు..
