HomeAndhra Pradeshరంపచోడవరంలో ముఖ్యమంత్రి పర్యటన సభాస్థలి పనులను పరిశీలించిన పోలవరం జిల్లా: జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్...

రంపచోడవరంలో ముఖ్యమంత్రి పర్యటన సభాస్థలి పనులను పరిశీలించిన పోలవరం జిల్లా: జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం పర్యటన నేపథ్యంలో సభ స్థలి వద్ద ముందస్తు ఏర్పాట్లు ఎక్కడికక్కడ ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఎలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని, పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పనులు ఎక్కడికక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయ ని ఆయన అన్నారు. ఈక్రమంలోనే స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలు అనుమతులు వచ్చిన వెంటనే ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా రెవిన్యూ అధికారి పి. అంబేద్కర్, డిపిఓ చంద్రశేఖర్, తాసిల్దార్ సిహెచ్ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ. శ్రీనివాసరావు, డి ఈ భవాని, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular