HomeUncategorizedరామవరం సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం

రామవరం సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం

జగ్గంపేట, జూలై 16: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారుకు స్వల్ప నష్టం వాటిల్లగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని సమాచారం. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular