HomeUncategorizedవిద్యార్థులకు రాష్ట్రస్థాయి షైనింగ్ స్టార్ అవార్డులు.

విద్యార్థులకు రాష్ట్రస్థాయి షైనింగ్ స్టార్ అవార్డులు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలానికి చెందిన జడ్‌పీహెచ్ స్కూల్ జె.నాయుడు పాలెం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి “షైనింగ్ స్టార్ అవార్డ్స్–2026”లో సత్తా చాటారు. ఈ అవార్డుల్లో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎం. జగదీష్ 600 మార్కుల్లో 587 మార్కులు సాధించి రోలుగుంట మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. అతనికి నూజివీడ్ ఐఐఐటిలో సీటు లభించింది. అలాగే కె. జగదీష్ 576 మార్కులతో ద్వితీయ స్థానం సాధించి ఆర్కే వ్యాలీ ఐఐఐలో సీటు పొందాడు.ఈ ఇద్దరు విద్యార్థులకు“షైనింగ్ స్టార్ అవార్డు”కింద ప్రశంసాపత్రం, మెడల్ మరియు రూ.20,వేలు నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ విజయానికి పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించినట్లు నిర్వాహకులు తెలిపారు.విద్యార్థుల ఈ విజయంపై స్థానిక ప్రజలు, ఉపాధ్యాయ వర్గం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular