HomeAndhra Pradeshఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కు అందజేత

ఎమ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కు అందజేత

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెరికోస్ వెయిన్స్ వ్యాధితో బాధపడుతున్న పేద , మధ్యతరగతి రోగులకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తోందని ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా పేర్కొన్నారు. రంపచోడవరం నియోజవర్గం చింతూరు డివిజన్ పరిధిలోని ఎటపాక మండలం గౌరీదేవిపేట పంచాయతీ గన్నేరుకొయ్యపాడు గ్రామానికి చెందిన బుడిపిటి కృష్ణార్జునరావు గత 3 సంవత్సరాలుగా వెరికోస్ వెయిన్స్ (కాళ్ల) వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న క్రమంలో ఈ విషయాన్ని బాధిత కుటుంబం స్థానిక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావుకు తెలియజేయగా ఆయన ద్వారా స్థానిక రంపచోడవరం శాసన సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషదేవి భాస్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షల 74 వేల రూపాయల సహాయ నిధిని మంజూరు చేయించారు. ఇటివలే బాధితుడు కృష్ణార్జునరావు రెండు కాళ్లకు వెరికోస్ వెయిన్స్ శస్త్ర చికిత్స విజయవాడలోని అభయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోవిజయవంతంగా జరిగింది. ఈ క్రమంలో బాధితుని కుటుంబానీకి ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆదేశాల మేరకు మంజూరైన బ్యాంకు చెక్కును వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు చేతుల మీదుగా బయట కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మడకం నరసింహారావు , ముక్కెర భద్రరావు , మల్లెల లక్ష్మణరావు , గవ్వల పద్మ , జింక సోమమ్మ , బుడిపిటి వాణి , పల్లంటి అరుణ , బుడిపిటి నవ్య , సూదిపాక జయమ్మ , మార్త చంటి , కంగాల మంగ , బాబురావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular