HomeUncategorizedడీఎంహెచ్‌ఓ డాక్టర్ అనితతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భేటీ..... ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై...

డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనితతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భేటీ….. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దిశానిర్దేశం

కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూలై 18:కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ అనిత శనివారం జగ్గంపేటలోని రావులమ్మ నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో వైద్య సేవల మెరుగుదల, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా కాకినాడ జనరల్ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆసుపత్రి ఆవరణలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసినట్లు డాక్టర్ అనిత తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్‌వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, పాఠంశెట్టి మురళీకృష్ణ, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular